కురవి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా. శబరీష్ పి., ఐపీఎస్
ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి
మహిళలు, చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
డ్రంక్ అండ్ డ్రైవ్, గుడుంబా, గంజాయిపై ప్రత్యేక నిఘా, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి
కురవి పోలీస్ స్టేషన్ సందర్శించి తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్
ముల్లంగి మోహన్ రెడ్డి తెలంగాణ ఎసెన్స్ మహబూబాబాద్ జిల్లా కరస్పాండ్ సెప్టెంబర్ 28మహబూబాబాద్ రూరల్ సర్కిల్ పరిధిలోని కురవి పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ డా. శబరీష్ పి., ఐపీఎస్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది యూనిఫాంను పరిశీలించారు,పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ క్రమం తప్పకుండా హెల్త్ చెకప్‌లు చేయించుకోవాలని తెలిపారు.
పోలీస్ అధికారులు, సిబ్బంది తమ పరిధిలోని గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకోవాలని ఎస్పీ సూచించారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ పోలీసులపై విశ్వాసం పెంపొందించేలా విధులు నిర్వహించాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఎస్పీ వాటిని పరిశుభ్రంగా, క్రమబద్ధంగా నిర్వహించాలని ఆదేశించారు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను క్రమపద్ధతిలో భద్రపరచాలని సూచించారు.
స్టేషన్‌లోని లాక్అప్, e-COPS, రైటర్స్ రూమ్ తదితర విభాగాలను పరిశీలించిన ఎస్పీ, CCTNS, e-Summons, e-Sakshya, ఆన్లైన్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్, TG-COP తదితర పోలీసింగ్ వ్యవస్థల అమలుపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు, గంజాయి నేరస్థులు, బూజర్స్, CCTV సర్వైలెన్స్ తదితర అంశాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. సంబంధిత శాఖల సమన్వయంతో బ్లాక్ స్పాట్లను గుర్తించి, ప్రజలకు ముందస్తు హెచ్చరికలు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత
మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ సూచించారు. మహిళలు, చిన్నారులకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణ స్పందనతో పాటు, వారి భద్రతపై నిరంతరం పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్, గుడుంబా, గంజాయిపై ప్రత్యేక నిఘా
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. గుడుంబా తయారీ, విక్రయాలు, అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని తెలిపారు. గంజాయి వినియోగం, విక్రయాలు, రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు గ్రామాలు, విద్యాసంస్థల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
అత్యవసర పరిస్థితుల్లో బ్లూ కోల్ట్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే సమయం, కోర్టు విధుల్లో ఉన్న సిబ్బంది, పెండింగ్ కేసుల వివరాలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల్లో చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందిస్తూ, పోలీసులపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఎస్పీ తెలిపారు.