🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 29 Sep, 2026 | Page: 1

వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికపై సర్పంచుల సమక్షంలో జలసిరి పోస్టర్ ఆవిష్కరణ

ప్రతి గ్రామములో ముఖ్య ప్రాధాన్యత పనులు చేపట్టాలి.*

*వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలో భాగంగా రిసోర్స్ మ్యాప్, సోషల్ మ్యాప్ వేసి పనులు గుర్తించాలి*

*పర్వతగిరి ఎంపీడీవో మాలోత్ శంకర్ నాయక్.*

*జన చరిత్ర న్యూస్ పర్వతగిరి , సెప్టెంబర్ 28 :*

పర్వతగిరి మండలం 33 గ్రామ పంచాయతీలలో గ్రామాల ప్రజల అవసరాల మేరకు గ్రామ అభివృద్ధిలో భాగంగా
వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్‌లో భాగంగా గ్రామాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళిక రూపొందించేందుకు రిసోర్స్ మ్యాప్ (Resource Map), సోషల్ మ్యాప్ (Social Map) తయారు చేయాలని సర్పంచులకు , కార్యదర్శులకు శిక్షణ ఎంపీడీవో సమావేశ హాల్లో అవగాహన ఎంపీడీఓ మాలోత్ శంకర్ నాయక్ కల్పించారు. అనంతరం సర్పంచుల సమక్షంలో జలసిరి పోస్టర్ను ఎంపీడీవో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికలో భాగంగా గ్రామాల ప్రజల అవసరాల మేరకు ప్రాధాన్యత క్రమంలో గ్రామాల అభివృద్ధి మేరకు పనులు చేపట్టాలని తెలుపుతూ వి బి జి రామ్ జీ పథకంలో 375 రకాల పనులలో మొదట ప్రాధాన్యత క్రమంలో
రిసోర్స్ మ్యాప్ ద్వారా గ్రామంలో ఉన్న నీటి వనరులు, చెరువులు, కుంటలు, కాలువలు, వ్యవసాయ భూములు, ప్రభుత్వ స్థలాలు, రహదారులు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఇతర మౌలిక వసతులు వంటి వనరులను గుర్తించి మ్యాప్‌లో పొందుపరచాలన్నారు.
అదేవిధంగా సోషల్ మ్యాప్ ద్వారా గ్రామంలోని కుటుంబాల వివరాలు, నివాస ప్రాంతాలు, సామాజిక వర్గాలు, పేద కుటుంబాలు, మహిళా సంఘాలు, వృద్ధులు, దివ్యాంగులు, ఇతర ముఖ్య సామాజిక వివరాలను గుర్తించి గ్రామ అవసరాలను అంచనా వేయాలి. అన్ని గ్రామాల్లో 2 రోజుల్లో
గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ఈ మ్యాప్‌లను రూపొందించి గ్రామంలో ఉన్న వనరులు, అవసరాలను సమగ్రంగా గుర్తించి VB G RAM G పథకం లో ఎక్కువ సంఖ్యలో పనులు ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేయాలని ఎంపీడీఓ తెలిపారు.
ఎంపీవో శేషు మాట్లాడుతూ..
గ్రామ పంచాయతీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ సిబ్బంది, గ్రామ స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు సమన్వయంతో రిసోర్స్ మ్యాప్, సోషల్ మ్యాప్‌లను పూర్తి చేసి, వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్ రూపకల్పనలో చురుకుగా పాల్గొనాలని ఎంపీవో సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపిఓ,ఈసీ , సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు -
🏠 Home