🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 30 Sep, 2026 | Page: 1

రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికైన ఉషోదయ హై స్కూల్ విద్యార్థులను అభినందించిన ఉషోదయ హై స్కూల్ డైరెక్టర్ గిరిగాని రాహుల్ వర్మ

ఎస్ జి ఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా వారి ఆధ్వర్యంలో నిన్న జేఎన్ఎస్ స్టేడియం హనుమకొండ యందు జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి రెజ్లింగ్ ఎస్జీఎఫ్ క్రీడా పోటీల్లో ఉషోదయ హై స్కూల్ పాఠశాల విద్యార్థులు అండర్ 14 సంవత్సరాల బాలుర ఫ్రీ స్టైల్ విభాగంలో 38 కేజీల పోటీలో విష్ణు, 62 కేజీల పోటీలో రిషిత్ లు గోల్డ్ మెడల్, శివకుమార్ 40 కేజీల పోటీల్లో సిల్వర్ మెడల్ , అండర్ 17 సంవత్సరాల బాలుర ఫ్రీ స్టైల్ 45 కేజీల విభాగంలో శశివర్ధన్ సిల్వర్ మెడల్, 48 కేజీల విభాగంలో రాహుల్,51 కేజీల విభాగంలో యశ్వంత్ సిల్వర్ మెడల్, 55 కేజీల విభాగంలో అరవింద సిల్వర్ మెడల్ మరియు అండర్ 17 సంవత్సరాల గ్రీకో రోమన్ 51 కేజీల విభాగంలో శ్రీరామ్ సిల్వర్ మెడల్స్ సాధించారు....
ఉమ్మడి వరంగల్ జిల్లా పోటీలో గెలుపొందిన క్రీడాకారులను ఉషోదయ హై స్కూల్ డైరెక్టర్ గిరిగాని రాహుల్ వర్మ అభినందించారు...
ఈ సందర్భంగా డైరెక్టర్ గిరిగాని రాహుల్ వర్మ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలోను రాణించాలని త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అవ్వాలని అభినందించారు...
ఈ యొక్క కార్యక్రమంలో ఉషోదయ హైస్కూల్ ప్రిన్సిపాల్ చంద్రగిరి మహేష్, వైస్ ప్రిన్సిపల్ వీరన్న, వ్యాయమ విద్య ఉపాధ్యాయులు కుంట విజేందర్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు...
🏠 Home