అన్నారం గ్రామంలో బతుకమ్మ విగ్రహ ప్రతిష్ట స్థలంలో భూమి పూజ కార్యక్రమం - చెరువు కట్టపైన దర్గా సమీపంలో ఏర్పాటు
జన చరిత్ర న్యూస్
పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలోని చెరువు కట్టపైన దర్గా సమీపంలో గల మెట్ల పై బతుకమ్మ విగ్రహ ప్రతిష్ట చేయు స్థలంలో ఈరోజు భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సర్పంచ్ మహేందర్ మాట్లాడుతూ, బతుకమ్మ విగ్రహ ప్రతిష్ట గ్రామ సంస్కృతి, సంప్రదాయాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన అడుగు అని, గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. ఈ ప్రతిష్ట కార్యక్రమం గ్రామ ఐక్యతకు, సమైక్యతకు నిదర్శనమని అన్నారు. వరంగల్ మార్కెట్ డైరెక్టర్ గొడుగు బిక్షపతి మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధిలో ఇటువంటి కార్యక్రమాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని, తాను సదా గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాడి పెళ్లి మహేందర్, ఉపసర్పంచ్ గొడుగు ఏకాంత సారయ్య , వరంగల్ మార్కెట్ డైరెక్టర్ గొడుగు బిక్షపతి , గ్రామ పంచాయతీ కార్యదర్శి నిమ్మల రాజు, బీజేపీ నాయకులు మరియు రిపోర్టర్ గొల్లపల్లి సంతోష్ కుమార్, విద్యుత్ ఉద్యోగి పెండ్యాల దయాకర్
వార్డు సభ్యులు రాపోలు అనిత రవీందర్, ముంజంపల్లి నాగరాజు, గాడి పెళ్లి రాజబాబు, బత్తిన జలంధర్, కొండేటి కొమరమ్మ రామచందర్,, కారోబార్ గుండ యాకయ్య, వాటర్ మెన్ రామచందర్, తంగళ్ళపల్లి రవీంద్ర చారి,
తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని సహకారం అందించారు.