🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 30 Sep, 2026 | Page: 1

బాలపాల లింగ్యా తండాలో పోలీసుల తనిఖీలు 20 వాహనాలు గుర్తింపు.. గుడుంబా, బెల్లం ఊట ధ్వంసం

తెలంగాణ ఎసెన్స్ మహబూబాబాద్ జిల్లా కరస్పాండెంట్, సెప్టెంబర్ 30: కురవి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలపాల లింగ్యా తండాలో బుధవారం ఉదయం పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఉదయం 5:30 గంటల నుంచి 7:45 గంటల వరకు సుమారు 100 ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 20 వాహనాలను గుర్తించారు. అలాగే అక్రమంగా తయారు చేస్తున్న 30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని, సుమారు 1,000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

అనంతరం గ్రామస్తులకు రోడ్డు ప్రమాదాల నివారణ, గంజాయి వినియోగం వల్ల కలిగే నష్టాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై పోలీసులు అవగాహన కల్పించారు. గ్రామంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సర్కిల్ ఫోర్స్‌కు చెందిన 26 మంది, స్పెషల్ పార్టీకి చెందిన 14 మంది కలిపి మొత్తం 40 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home