🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 30 Sep, 2026 | Page: 1

పీఎం విశ్వకర్మ యోజనపై స్వర్ణకారుల ప్రత్యేక సమావేశం

వరంగల్: వరంగల్ విశ్వకర్మ వీధిలోని విశ్వకర్మ స్వర్ణకార వసతి భవన్‌లో గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో పీఎం విశ్వకర్మ యోజనపై స్వర్ణకారుల ప్రత్యేక సమావేశం బుధవారం (30-09-2026) నిర్వహించారు. ఈ సమావేశానికి ఇప్పటికే పీఎం విశ్వకర్మ యోజన ద్వారా లబ్ధి పొందిన స్వర్ణకారులతో పాటు, పథకం ద్వారా లబ్ధి పొందేందుకు ఆసక్తి ఉన్న పలువురు స్వర్ణకారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పీఎం విశ్వకర్మ యోజనకు సంబంధించిన అర్హతలు, పథకం ద్వారా కలిగే ప్రయోజనాలు, దరఖాస్తు విధానం, ప్రభుత్వ సహాయాలు తదితర అంశాలపై స్వర్ణకారులకు అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి స్వర్ణకారుడు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు.
అనంతరం బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గందెమల్ల ఆనంద్ గౌడ్కు గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం తరఫున వినతి పత్రం అందజేశారు. స్వర్ణకారుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేసే అంశాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సహకరించాలని కోరారు. స్వర్ణకారుల వృత్తి పరిరక్షణతో పాటు వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కుసుమ సతీష్, బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కూచన క్రాంతి కుమార్, బీజేపీ మాజీ కార్పొరేటర్ గందె కల్పన నవీన్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి కట్టా రాజేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కందుకూరి చంద్రసేన, కిషోర్, కృష్ణ, ఉమ్మడి జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు కట్టా ఈశ్వర ప్రసాద్తో పాటు పలువురు స్వర్ణకార సంఘం ప్రతినిధులు, స్వర్ణకారులు పాల్గొన్నారు.
స్వర్ణకారుల సమస్యలు, వృత్తి పరిరక్షణ, సంక్షేమం, ప్రభుత్వ పథకాలపై మరింత అవగాహన కల్పించేందుకు భవిష్యత్‌లో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తామని సంఘం ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులు, సంఘం ప్రతినిధులు, స్వర్ణకార సోదరులకు గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం కృతజ్ఞతలు తెలిపింది.
🏠 Home