🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 01 Oct, 2026 | Page: 1

తక్షణమే స్పందించిన మున్సిపల్ సిబ్బంది : ప్లాస్టిక్ వ్యర్ధాలతో కూడిన చెత్తాచెదారాన్ని తొలగించిన పారిశుద్ధ్య కార్మికులు

చౌటుప్పల్: స్వచ్ఛత హీ సేవా 2026 కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, కమిషనర్ ఆదేశానుసారం, నాగులకుంట పక్కన షాది ఖానా నాలా లో పేరుకుపోయిన చెత్తాచెదారం, ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్స్, అనేక వ్యర్థ పదార్థాలను తొలగించి నీళ్లు సాఫీగా పోవుటకు చేయడం జరిగింది. జన చరిత్ర న్యూస్ వార్తను ప్రచురించగా, తక్షణమే స్పందించి మునిసిపల్ శాఖావారు చెత్తను తొలగించడం పట్ల , చైర్ పర్సన్ చూపిన చొరవపట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ స్థానికంగా ఉన్న సమస్యల ను పరిష్కరించడంలో ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అహర్నిశలు పట్టణ అభివృద్ధికి పాటుపడతామని తెలియజేశారు. అలాగే ప్రజలు కూడా పట్టణ స్వచ్ఛత పట్ల అవగాహన కలిగి ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్తాచెదారం వేయొద్దని, మున్సిపల్ శాఖ వారి సలహాలు సూచనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, పర్యావరణ ఇంజనీర్ రేణు కుమార్, జవాన్ నరసింహ, పారిశుద్ధ్య సిబ్బంది, మరియు పంజాబ్ నేషనల్ బ్యాంక్- చౌటుప్పల్ మేనేజర్ జంపాల స్వప్న , సిబ్బంది ఎం సుధీర్ , ఎండి రెహాన్ ఈ కార్యక్రమం లో భాగస్వామ్యం అయినారు .
🏠 Home