🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 01 Oct, 2026 | Page: 1

నేటి పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని విజయవంతం చేయాలి.. టీయూడబ్ల్యూజే(143) జిల్లా అధ్యక్షుడు జయశంకర్ గౌడ్

తిప్పర్తి అక్టోబర్ 1 :
జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే క్యాష్ లెస్ చికిత్స అందించేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారం రోజులపాటు టీయూడబ్ల్యూజే(143) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పోస్టు కార్డుల ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్ అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నూతనంగా ఎన్నికైన టీయూడబ్ల్యూజే(143) తిప్పర్తి మండల కమిటీని అభినందించిన అనంతరం ఆయన మాట్లాడారు.

టీయూడబ్ల్యుజే 143 అనే సంఘం జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు . జర్నలిస్టుల సంక్షేమం కోసం గతంలో హెల్త్ కార్డుల సాధనతో పాటు మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం, వారి పిల్లల విద్యకు చేయూత అందించినట్లు తెలిపారు. కరోనా సమయంలోనూ అల్లం నారాయణ ఆధ్వర్యంలో కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించిన విషయాన్ని గుర్తు చేశారు.

ప్రస్తుతం జర్నలిస్టుల హెల్త్ కార్డులు కొన్ని ఆసుపత్రుల్లోనే పరిమితంగా అమలవుతున్నాయని, రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో కార్డులు చెల్లుబాటు అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నూతన కమిటీకి అభినందనలు..

టీయూడబ్ల్యూజే(143) తిప్పర్తి మండల నూతన అధ్యక్షుడిగా జేరుపోతుల సైదులు గౌడ్ (సీనియర్ జర్నలిస్టు), ప్రధాన కార్యదర్శుగా జంజరాల రవికుమార్ (నమస్తే తెలంగాణ) ఎన్నికైన సందర్భంగా వారిని అభినందించారు.

కార్యక్రమంలో సంఘం నాయకులు faheem, నకిరేకంటి శ్రీనివాస్ గౌడ్, దండంపల్లి రవికుమార్, గంట సైదులు, మామిడి వెంకటేశ్వర్లు, కారింగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home