మార్పు చేసిన సైలెన్సర్లకు రోడ్డు రోలర్ తో ధ్వంసం350 సైలెన్సర్లు ధ్వంసం..అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు
*తెలంగాణ/వరంగల్,అక్టోబర్ 1*
వరంగల్: శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వాహనాల మార్పు చేసిన సైలెన్సర్లపై వరంగల్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు.పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత,ఐపీఎస్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో గురువారం వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ సర్కిల్ వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.వాహనాల కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేసి అమర్చిన,అధిక శబ్దాన్ని వెలువరించే సైలెన్సర్లను తనిఖీల సందర్భంగా పోలీసులు తొలగించి స్వాధీనం చేసుకున్నారు.ఇలా స్వాధీనం చేసుకున్న సుమారు 350 మార్పు చేసిన సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్‌రావు మాట్లాడుతూ..వాహనాల సైలెన్సర్లను మార్చి అధిక శబ్దం వచ్చేలా వినియోగించడం వల్ల శబ్ద కాలుష్యం పెరగడంతో పాటు ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని తెలిపారు.ముఖ్యంగా విద్యార్థులు,వృద్ధులు,అనారోగ్యంతో ఉన్నవారు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందన్నారు.వాహనదారులు తమ వాహనాల్లో కంపెనీ అమర్చిన ఒరిజినల్ సైలెన్సర్లనే వినియోగించాలని సూచించారు.నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లను మార్చి అధిక శబ్దం వచ్చేలా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ టి.సత్యనారాయణ,ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సుజాత,ఇతర ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.