మహిళల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి భారతి డిగ్రీ కళాశాలలో షీ టీమ్ ఎస్సై రామారావు అవగాహన సదస్సు
వరంగల్: మహిళలపై జరుగుతున్న నేరాలు, అఘాయిత్యాల నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వరంగల్ షీ టీమ్ ఎస్సై రామారావు సూచించారు. జాగ్రత్తగా, అప్రమత్తంగా వ్యవహరించడం ద్వారా మహిళలపై జరిగే నేరాలను అరికట్టవచ్చని తెలిపారు.
వరంగల్‌లోని భారతి డిగ్రీ కళాశాలలో సుమారు 150 మంది విద్యార్థినులకు మహిళల భద్రత, సైబర్ నేరాలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, టీ-సేఫ్ యాప్ వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రామారావు మాట్లాడుతూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత ఫొటోలు, వివరాలను పంచుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మహిళలు ఒంటరిగా తెలియని ప్రాంతాలకు ప్రయాణించాల్సి వచ్చినప్పుడు టీ-సేఫ్ యాప్‌ను వినియోగించుకోవాలని, దాని ఉపయోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఉద్యోగాలు చేసే మహిళలు పనిచేసే ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తించే వ్యక్తులు, ఆకతాయిల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులతో వ్యక్తిగత విషయాలను పంచుకోవద్దని పేర్కొన్నారు.
మహిళలపై ఎవరైనా అనుచితంగా లేదా అసభ్యంగా ప్రవర్తించినట్లయితే భయపడకుండా వెంటనే షీ టీమ్ పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై రామారావు సూచించారు. సైబర్ నేరాలకు గురైన వారు వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
షీ టీమ్‌కు సంబంధించిన వాట్సాప్ నంబర్లకు కూడా ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచి, నేరాలకు పాల్పడే వారికి కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో భారతి డిగ్రీ కళాశాల డైరెక్టర్, ప్రిన్సిపాల్ నిరుకుల్ల సంజీవ్ రావు, అడ్మిన్ సతీష్, అధ్యాపకులు, షీ టీమ్ ఎస్సై రామారావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.