కేయూసీ పోలీస్‌స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం విక్రయంపై టాస్క్‌ఫోర్స్ దాడి రూ.1.12 లక్షల విలువైన మద్యం స్వాధీనం.. ఒకరి అరెస్ట్
హనుమకొండ, అక్టోబర్ 2: అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం కేయూసీ పోలీస్‌స్టేషన్ పరిధిలో దాడి నిర్వహించారు. హనుమకొండ వినాయకనగర్‌లోని లయోలా పాఠశాల సమీపంలో నిర్వహించిన ఈ దాడిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న అంగిడి సమ్మక్క (65)ను అదుపులోకి తీసుకున్నారు.
ఆమె వద్ద నుంచి వివిధ రకాల మద్యం, బీరు సీసాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.1,12,430గా పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాటిలో కేఎఫ్ లైట్ 114, కేఎఫ్ స్ట్రాంగ్ 53, బకార్డీ 31, బడ్వైజర్ టిన్ బీర్లు 127, టుబోర్గ్ బీర్లు 64, సుమో 180 ఎంఎల్ 42, ఆఫీసర్స్ ఛాయిస్ 180 ఎంఎల్ 43, డౌన్‌టౌన్ 180 ఎంఎల్ 5, రాయల్ స్టాగ్ 180 ఎంఎల్ 12, మెక్‌డోవెల్స్ 180 ఎంఎల్ 16, ఇంపీరియల్ బ్లూ 180 ఎంఎల్ 5 ఉన్నాయి.
అలాగే రాయల్ స్టాగ్ 90 ఎంఎల్ 15, ఆఫీసర్స్ ఛాయిస్ 90 ఎంఎల్ 2, ఇంపీరియల్ బ్లూ 90 ఎంఎల్ 9, సిగ్నేచర్ 180 ఎంఎల్ 8, మ్యాజిక్ మూమెంట్స్ 180 ఎంఎల్ 6, రాయల్ ఛాలెంజ్ రెడ్ 180 ఎంఎల్ 6, రాయల్ గ్రీన్ 180 ఎంఎల్ 5, బ్లెండర్స్ ప్రైడ్ 180 ఎంఎల్ 10, 8 పీఎం 180 ఎంఎల్ 14, టుబోర్గ్ గ్రీన్ 36 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఎలాంటి చెల్లుబాటు అయ్యే అనుమతి లేదా లైసెన్స్ లేకుండా మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని, స్వాధీనం చేసుకున్న మద్యం సరుకుతో పాటు కేయూసీ పోలీసులకు అప్పగించారు. తదుపరి చట్టపరమైన చర్యలు కేయూసీ పోలీసులు చేపట్టనున్నారు.
ఈ దాడిలో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ఎ. మధుసూదన్, ఇన్స్పెక్టర్ జి. సుబ్బారెడ్డి, ఎస్సై బి. ఉప్పలయ్యతో పాటు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.