కొత్తవాడలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నల్లా నర్సింహులు శతజయంతి ఉత్సవాలు నిర్వహించిన చిప్ప వెంకటేశ్వర్లు నేత…..
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, విప్లవ సింహం పద్మశాలి ముద్దుబిడ్డ నల్ల నర్సింహులు శత జయంతి సందర్భంగా కొత్తవాడ 80 ఫీట్ల రోడ్ అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించిన చిప్ప వెంకటేశ్వర్లు నేత, ప్రజా సంఘం నాయకులు. దొరలకు భూస్వాములకు వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి తుపాకి అందుకొని ప్రజా సైన్యం తయారుచేసి చైతన్యవంతం చేసి నిజాం గుండెల్లో సింహస్వప్నం లా నిలిచిన దీశాలి. 4000 వేల గ్రామాలు 15000 వేల ఎకరాల భూమిని వెట్టి నుండి విముక్తి చేసి ప్రజలకు పంచడం జరిగింది. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే రజాకార్ల మూకలను ఊర్ల నుంచి పొలిమేర వరకు తరిమిన వీరుడు ప్రజా యుద్ధం నడిపిన నల్ల నరసింహులు గారి దళంలో దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, షేక్ బందగీ లాంటి వారు దొరలకు, దేశముఖ్ లకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. 3 సార్లు ఉరిశిక్ష పడినా అలుపెరగని పోరాటం చేశారు. భార్య వజ్రమ్మతో సహా నల్ల మల అడవుల్లో తలదాచుకుంటూ ఉద్యమాన్ని ముందుకు నడిపినారు. అలాంటి త్యాగధనులను చరిత్ర మరిచిపోకుండా ఉండేదుకు ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చి గౌరవించాలని చిప్ప వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో 23 వ డివిజన్ అధ్యక్షులు దామెర రాజ్ కమల్, చేనేత విభాగం జిల్లా అధ్యక్షులు దాసరి రాజశేఖర్, సహకార సంఘాల అధ్యక్షులు దువ్వల రాజేందర్, అడిగొప్పుల సంపత్, పిట్ట రాములు, ఆడెపు రవి, బొల్లు సతీష్, రావుల రాజీవ్, మాటేటి రాములు, వల్లాల మొగిలి, బూర వేణుమాధవ్, దాసరి రాజయ్య, నంబి మురళి, దేవర రాము, బండి రమేష్, తుమ్మ రాము, గుత్తికొండ తిరుపతి, కూచన రవి, గొండ ప్రసాద్, బస్వరాజు మల్లేశం, జంపాల వేణుగోపాల్, దొంతుల ఉమా, బండారి లావణ్య తదితరులు పాల్గొన్నారు.