🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 02 Oct, 2026 | Page: 1

దొడ్డి కొమురయ్య విగ్రహం నెలకొల్పాలని వరంగల్ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు కొండ సురేఖ మురళీధర్ రావు కు వినతిపత్రం

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడైన బీసీ కులంను చెందిన కురుమ ముద్దుబిడ్డ దొడ్డి కొమురయ్య గారి రూపురేఖలు నేటి తరానికి తెలియపరచడానికి ప్రభుత్వపరంగా విగ్రహం నెలకొల్పాలని వరంగల్ జిల్లా కురుమ సంఘం కన్వీనర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో వరంగల్ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు కొండ సురేఖ మురళీధర్ రావు కు వినతిపత్రం ఇచ్చినారు దొడ్డి కొమురయ్య గారి జననం 2027 సంవత్సరంలో 100 సంవత్సరములు పూర్తి కావస్తుందని ఇప్పటివరకు ప్రభుత్వం వారి యొక్క పోరాట పటిమను నాలుగు గోడల మధ్య పొగుడుతున్నారని నేటి తరానికి తెలియపరచడానికి వరంగల్ నగరంలోని నాయుడు పెట్రోల్ పంపు జంక్షన్ వద్ద గాని ఉర్సుగుట్ట జంక్షన్ వద్ద గాని ప్రభుత్వం దొడ్డి కొమురయ్య విగ్రహమును నెలకొల్పి హంటర్ రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి రంగసాయిపేట నాయుడు పెట్రోల్ పంప్ జంక్షన్ వరకు ఉన్న రహదారికి దొడ్డి కొమురయ్య పేరును నామకరణ చేయాలని వరంగల్ కురుమ సంఘం నాయకులు ఎమ్మెల్యే కొండా సురేఖ కు వివరించి కోరి నారు వరంగల్ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యురాలు కొండ సురేఖ స్పందిస్తూ వరంగల్ నగరంలో విగ్రహం నేలగోల్పడానికి సరైన స్థలం కొరకు కమిషనర్ గారు దృష్టికి తీసుకు వస్తానని సంబంధిత అధికారులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటానని mla కొండ సురేఖ గారు కురుమ సంఘం నాయకులకు హామీ ఇచ్చినారు వినతి పత్రం ఇచ్చిన వారిలో కురుమ సంఘం నాయకులు కోరే కృష్ణ చీర అశోక్ మిరియాల కుమారస్వామి చీర భరత్ కుండె సదానందం కోరే కుమారస్వామి గొట్టే సదానందం గౌడ కోటేశ్వర్ కొలుపుల కోటేశ్వర్ లు ఉన్నారు
🏠 Home