🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 02 Oct, 2026 | Page: 1

బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించడమే గాంధీజీకి అందించే నిజమైన నివాళి-ఎసిపి-డి.రమణబాబు

జాతిపిత మహాత్మా గాంధీజీ 157వ జయంతి సందర్భంగా మడికొండ లోని కమిషనరేట్‌ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన ఎసిపి-డి. రమణబాబు .
ఈ సందర్భంగా ఎసిపి మాట్లాడుతూ, సత్యం, అహింస, శాంతి, సత్యాగ్రహం అనే మహోన్నత సిద్ధాంతాలతో భారత స్వాతంత్ర్య ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన మహాత్మా గాంధీజీ దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. గాంధీజీ జీవితమే సత్యం, నైతిక విలువలు, నిరాడంబరత, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచిందన్నారు.
గాంధీజీ నమ్మిన “అహింసా పరమో ధర్మః” అనే స్ఫూర్తితో సమాజంలో శాంతి, సామరస్యం, సోదరభావం, పరస్పర గౌరవాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ, నిజాయితీ, నైతిక విలువలను పాటించడంతో పాటు సమాజం పట్ల బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించడమే గాంధీజీకి అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సి.ఐ.కె.సూర్య ప్రకాష్, 5 వ బెటాలియన్ ఆర్ఐ, సివిల్ మరియు 5 వ బెటాలియన్ పోలీస్ సిబ్బంది పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీజీకి ఘనంగా నివాళులర్పించారు.
🏠 Home