🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 02 Oct, 2026 | Page: 1

యూత్ నాయకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు


జన చరిత్ర న్యూస్
పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ యువ నాయకుడు పుల్లూరి దిలీప్ గారు ఇటీవల అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు గారు దిలీప్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా సేవలో, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. అవసరమైన సమయంలో తనకు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటారని భరోసా కల్పించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి యువ నాయకులు చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దిలీప్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో పర్వతగిరి మండల అధ్యక్షురాలు సావిత్రి, సర్పంచ్ శంకర్, కల్లెడ PACS చైర్మెన్ పిన్నింటి అనిల్ రావు, చౌటపల్లి PACS చైర్మెన్ అత్తి కుమారస్వామి, మాజీ జడ్పీటీసీ బానోత్ సింగులాల్, ఏనుమాముల మార్కెట్ డాక్టర్ గొడుగు బిక్షపతి, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డుమెంబర్లు, మండల సీనియర్ నాయకులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home