🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 02 Oct, 2026 | Page: 1

బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోతో వరంగల్ మెరిసిపోతోంది అక్టోబర్ 18 వరకు ప్రత్యేక ప్రదర్శన..రూ.లక్షకు పైగా వజ్రాభరణాల కొనుగోలుపై ఉచిత బంగారు నాణెం

*తెలంగాణ/వరంగల్,అక్టోబర్ 2*

వరంగల్: ప్రపంచ ప్రఖ్యాత ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్ వరంగల్‌లోని విజయ టాకీస్ ఎదురుగా ఉన్న తమ షోరూమ్‌లో శుక్రవారం నుంచి ప్రత్యేక ‘బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో’ను ప్రారంభించింది.వజ్రాభరణాల్లో సరికొత్త డిజైన్లు,అత్యున్నత నైపుణ్యం,సంప్రదాయం–ఆధునికతల సమ్మేళనంతో రూపొందించిన ఆభరణాలు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.ఈ కార్యక్రమాన్ని జోయాలుక్కాస్ తెలంగాణ రీజియన్ క్లస్టర్ మేనేజర్ లివిన్ లాజర్,రీజినల్ మేనేజర్(మార్కెటింగ్)కె.శ్రీనివాస్,గౌరవనీయ వినియోగదారులు, ఇతర ప్రముఖులు కలిసి ప్రారంభించారు.వివాహ వేడుకలకు అనువైన ప్రత్యేక నగల సెట్లతో పాటు రోజువారీ వినియోగానికి సరిపోయే ఆధునిక వజ్రాభరణాలు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయి.పరిమిత కాలం మాత్రమే లభించే ప్రత్యేక డిజైన్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.ప్రదర్శన సందర్భంగా రూ.1లక్ష లేదా అంతకంటే ఎక్కువ విలువైన వజ్రాభరణాలు కొనుగోలు చేసే ప్రతి వినియోగదారుడికి ఉచిత బంగారు నాణెం అందించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.అక్టోబర్ 2 నుంచి 18 వరకు మాత్రమే జరిగే ఈ ప్రత్యేక ప్రదర్శనలో వజ్రాల ఆభరణాల సరికొత్త కలెక్షన్‌ను సందర్శకులు వీక్షించవచ్చని పేర్కొన్నారు.జోయాలుక్కాస్ గ్రూప్ ఛైర్మన్,మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జోయ్ అలుక్కాస్ మాట్లాడుతూ..వజ్రాల శాశ్వతమైన ఆకర్షణకు,అత్యుత్తమ ఆభరణాల రూపకల్పనకు ‘బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో’ ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.తెలంగాణ తమ సంస్థ ప్రయాణంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని,పండుగల వేళ ఈ ప్రదర్శన ద్వారా వినియోగదారులకు ప్రత్యేకమైన డిజైన్లను అందించే అవకాశం లభించిందని పేర్కొన్నారు.
🏠 Home