🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 03 Oct, 2026 | Page: 1

సత్యం,అహింస నినాదంతో స్వదేశం కోసం పొరాడిన గొప్ప దార్శనికుడు మహాత్మ గాంధీ మాజీ మంత్రి కొండా సురేఖ

*
ఈరోజు గాంధీ జయంతి సంధర్భంగా వరంగల్ పోస్ట్ ఆఫీస్ స్టేషన్ రోడ్డు లో గల మహాత్మగాంధీ విగ్రహనికి మాజీ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ గాంధీ గారి సిధ్ధాంతాలను దృష్టిలో ఉంచుకొని నవ భారత నిర్మాణానికి మనమందరం పనిచేయాలి తెపిపారు.మహాత్మా గాంధీ సత్యం,అహింస,శాంతి,సామరస్యాన్ని ఆయుధాలుగా చేసుకుని దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించారని,గాంధీజీ చూపిన సత్యం,అహింస మార్గాలు నేటి సమాజానికి కూడా ఎంతో ఆదర్శప్రాయమని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు.గాంధీజీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలని, సమాజంలో శాంతి,సోదరభావం,సామాజిక సమానత్వాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని మాజీ మంత్రి సురేఖ పిలుపునిచ్చారు.గాంధీజీ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి అని మాజీ మంత్రి సురేఖ అన్నారు.
🏠 Home