🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 06 Oct, 2026 | Page: 1

నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికురాలి నగలు, ల్యాప్‌టాప్ చోరీకి యత్నం

నిందితుడిని అరెస్ట్ చేసిన జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది

వరంగల్: నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలి మెడలోని బంగారు గొలుసు, ల్యాప్‌టాప్, రెండు మొబైల్ ఫోన్లను బలవంతంగా లాక్కొని చోరీ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు.

జీఆర్పీ సీఐ వి. నరేష్ కుమార్ కథనం ప్రకారం.. అక్టోబర్ 5వ తేదీ రాత్రి సుమారు 2 గంటల సమయంలో 12788 నంబర్ నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లోని బీ-1 కోచ్‌లో ప్రయాణిస్తున్న మహిళ వద్ద చోరీకి నిందితుడు ప్రయత్నించాడు. ఆమె మెడలో ఉన్న సుమారు రూ.1 లక్ష విలువైన బంగారు గొలుసుతో పాటు, బ్యాగులో ఉన్న సుమారు రూ.1 లక్ష విలువైన ల్యాప్‌టాప్, రూ.60 వేల విలువైన రెండు మొబైల్ ఫోన్లను కలిపి మొత్తం రూ.2.60 లక్షల విలువైన వస్తువులను బలవంతంగా లాక్కొని వెళ్లేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి నాగ్‌పూర్, మహారాష్ట్రకు చెందిన షేక్ రజాక్, తండ్రి షఫీని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.

ఈ అరెస్ట్‌లో ఆర్పీఎఫ్ సిబ్బంది డి. రాము, కె. దినేష్, ఎస్. శ్రీనివాస్, శశికుమార్, ఆర్పీఎఫ్ సీఐబీ సిబ్బంది ఎన్. రమేష్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home