🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 06 Oct, 2026 | Page: 1

వర్ధన్నపేటలో దళిత యువతిని మోసం చేసిన మున్సిపల్ చైర్మన్ కొడుకు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

జన చరిత్ర న్యూస్ వర్ధన్ పేట
తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జన్ను నరసయ్య విజ్ఞప్తి
వర్ధన్నపేట పట్టణానికి చెందిన దళిత యువతి నీ ప్రేమ పేరుతో మోసం చేసిన వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ కుమారూడి పై చట్టపరమైన చర్యలు ప్రభుత్వ అధికారులు తీసుకోవాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జన్ను నరసయ్య విజ్ఞప్తి చేశారు

మంగళవారం రోజున వర్ధన్నపేటలో సారంగపాణి ఇంటి ముందు మోసపోయిన యువతి రెండో రోజు దీక్ష చేపట్టగా తెలంగాణ అంబేద్కర్ సంఘం తరఫున దళిత మహిళలకు సంఘీభావం ప్రకటించి అండగా ఉంటామని స్పష్టం చేశారు వర్ధన్నపేట శాసనసభ్యులు కూడా దళిత వర్గానికి చెందిన వ్యక్తి కనుక మున్సిపల్ చైర్మన్ కూడా అధికార పార్టీ చెందిన వ్యక్తి కావున ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని దళిత యువతి నీ చైర్మన్ కుమారుడు వివాహం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఈ సమావేశంలో మాస్ రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు,అంబేద్కర్ సంఘం వరంగల్ జిల్లా ఇన్చార్జి తాటికాయల వివేకనంద ,వరంగల్ జిల్లా కో కన్వీనర్ జంగిలి భాస్కర్లతో పాటు వర్ధన్నపేట పట్టణానికి చెందిన పలువురు మహిళలు పలు సంఘాల నాయకులు కూడా పాల్గొని సంఘీభావం ప్రకటించారు
🏠 Home