🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 07 Oct, 2026 | Page: 1

దళిత యువతికి బీఆర్ఎస్ సంఘీభావం*అమ్మాయి కి న్యాయం జరిగేంత వరకు పోరాడుతామాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్



వర్దన్నపేట, (జన చరిత్ర న్యూస్):వర్దన్నపేట మున్సిపల్ పట్టణంలో ని మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి కొడుకు పాలకుర్తి శ్రీకాంత్ చేతిలో ప్రేమ విషయం లో బలై గత రెండురోజులుగా చైర్మన్ ఇంటి ముందు టెంట్ వేసి మౌన పోరాటం చేస్తున్న దళిత యువతి శ్రీదేవిని మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ పరామర్శించి సంఘీభావం తెలిపిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రేమిస్తున్నాను నిన్నే పెళ్లి చేసుకుంటానని అమ్మాయి కి మాయ మాటలు చెప్పి శారీరకంగా అమ్మాయిని మూడు సంవత్సరాలుగా లోబర్చుకొని ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకొనని ముఖం చాటెస్తూ అమ్మాయి ని తీవ్ర మానసిక వేదనకు గురిచేయ్యటం సబబు కాదన్నారు.

గత మూడు రోజులుగా చైర్మన్ సారంగపణి ఇంటి ముందు టెంట్ వేసుకొని దీక్ష చేస్తున్నప్పటికీ ఎమ్మెల్యే స్పందించకపోవడంలో అంతర్యామేమిటోనని అన్నారు. దళిత ఎమ్మెల్యే వైన నీవు దళిత అమ్మాయి కి అన్యాయం జరిగితే ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. ఎప్పటికైనా కలుగచేసుకొని పాలకుర్తి శ్రీకాంత్ శ్రీదేవి లకు వివాహం జరిపించే విధంగా కృషిచేయాలన్నారు. లేని యెడల అమ్మాయి కి న్యాయం జరిగేంతావరకు బీఆర్ఎస్ పక్షాన పోరాటం కొనసాగిస్తామన్నారు

ఈ కార్యక్రమంలో ఆరూరి రమేష్ వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ అంగోతు అరుణతో పాటు స్థానిక మున్సిపల్ కౌన్సిలర్స్ గుజ్జ వీర రాఘవ రావు, సిలివేరు కుమారస్వామి యాదవ్, తిరుపతి సురేష్,తుమ్మల అరుణశ్రీధర్ బానోత్ జ్యోతినవీన్, చిలువేరు రమరాజశేఖర్, పార్టీ పట్టణ అధ్యక్షులు గోధుమల మధుసూదన్, మండల అధ్యక్షులు తూల్ల కుమారస్వామి,మాజీ జడ్పీటీసీ మార్గం బిక్షపతి, మాజీ మార్కెట్ చైర్మన్ లు గుజ్జ గోపాల్ రావు, గుజ్జ సంపత్ రెడ్డి. సీనియర్ నాయకులు తుమ్మల యాకయ్య, పూజారి రఘు,మిద్దెపాక రవీందర్, జన్నురాములు. చిన్నపాక శ్రీనివాస్.,అంగోతు బిక్షపతి,బానోత్ శ్రీనివాస్,మాజీ కో ఆప్షన్ మెంబర్ అజీమ్,మాజీ దేవస్థానం చైర్మన్ ఎరుకొండ వేణు గోపాల్, పట్టణ సోషల్ మీడియా కన్వీనర్ సిలివేరు శ్రీధర్ యాదవ్,పొనుగోటి చందర్ రావు,తోటకూరి శ్రీధర్, వసంత్ నాయక్,భూక్యా రామన్న నాయక్, బానోత్ రమేష్, సపావత్ వెంకన్న, డివిజన్ అధ్యక్షులు కొండేటి సుధాకర్, కొండేటి సంపత్,బక్కతట్ల శ్రీను,గుడ్ల సుభాష్,మారపెల్లి వంశీ, మరుపట్ల వేణు,బాల్లే రమేష్,నక్క రాజు, తరగల విష్ణు, తరగల కిషోర్,శ్రీనాద్, మేరుగు రాజేష్, కొబడేటి నాని, కంజర్ల రాజు,తోట రవి,మేకల శ్రీను,నీరటి ఎల్కయ్య తదితరులు పాల్గొన్నారు.
🏠 Home