చైత్యభూమిలో డా. బి.ఆర్. అంబేద్కర్‌కు AIYF నేతల ఘన నివాళులు
ముంబై, అక్టోబర్ 7: ముంబైలోని దాదర్ చైత్యభూమిని ఈరోజు AIYF జాతీయ కార్యదర్శి డాక్టర్ సయ్యద్ వలి ఉల్లా ఖాద్రి, AIYF తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి శ్రీమన్, AIYF తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎన్. శ్రీకాంత్, AIYF జాతీయ కార్యవర్గ సభ్యుడు కె. ధర్మేంద్ర సందర్శించి భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్కు ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తన జీవితాంతం సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, గౌరవం మరియు అణగారిన, అణచివేయబడిన వర్గాల హక్కుల కోసం పోరాడారని అన్నారు. ఆయన ఆలోచనలు దేశ ప్రజాస్వామ్యానికి, సామాజిక న్యాయ సాధనకు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
కుల వివక్ష, అంటరానితనం, అసమానతలకు వ్యతిరేకంగా అంబేద్కర్ చేసిన పోరాటాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని, రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తూ సమానత్వం, సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.