RTI వారోత్సవాలు నిర్వహించాలని ప్రధాన కార్యదర్శి కి వినతి పత్రం
హైద్రాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన అక్టోబర్ 12 ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలలో ""సమాచార వారోత్సవాలు"" నిర్వహించాలని ఆదేశాలు జారీ చెయ్యాలని సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిదంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం బోర్డులను సక్రమంగా, పూర్తి వివరాలతో నిర్వహించాలని, సమాచారం కోరిన దరఖాస్తుదారులకు సకాలంలో సమాచారం ఇచ్చేలా తగు ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గారిని సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ యర్ర మాద కృష్ణారెడ్డి, సమాచార హక్కు వికాస సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొదుమూరి దయాకర్ రావు, బానోతు హరి నాయక్, అప్పన్న వంశీ పాల్గొన్నారు.