🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 08 Oct, 2026 | Page: 1

పేదింటి పెళ్లికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎంతో చేయూతయిస్తుంది మాజీ మంత్రివర్యులు వరంగల్ తూర్పు శాసనసభ్యులు కొండ సురేఖ

వరంగల్ : తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పేదింటి పెళ్లిళ్ల కానుక కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ లబ్ధిదారులకు స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కొండా సురేఖ చేతుల మీదుగా 37వ డివిజన్లోని 9 మంది లబ్ధిదారులకు తొమ్మిది లక్షల ఒక వెయ్యి నలభై నాలుగు రూపాయల వీలువైన చెక్కులు తూర్పు శాసన సభ్యురాలు కొండా సురేఖ గారితో పాటు మాజీ కార్పొరేటర్ భోగి సువర్ణ సురేష్ లు కలిసి లబ్ధిదారులకు చెక్కులు అందించడం జరిగింది
ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని అందుకే ప్రభుత్వ ప్రజా ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ పేదింటి పెళ్లికి చేయూతనిస్తుందని రాబోయే కాలంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్య ల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ మంత్రి కొండ సురేఖ అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తో పాటు స్థానిక నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు.
🏠 Home