టిబి రహిత భారత్ లక్ష్యంగా యువత చురుకైన భాగస్వామ్యం కావాలి జోష్ టీముల కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
వరంగల్: జిల్లాను క్షయ వ్యాధి రహితంగా తీర్చిదిద్దేందుకు యువత, ఎన్సీసీ క్యాడెట్లు చురుకుగా భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పిలుపునిచ్చారు. టిబి ముక్త్ భారత్ – ఆయుష్మాన్ కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జోష్ టీముల కార్యక్రమాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన అవగాహన సమావేశంలో క్షయ వ్యాధి నివారణ, లక్షణాలు, చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు.
క్షయ వ్యాధి బ్యాక్టీరియా వల్ల కలిగే అంటువ్యాధి అని, ప్రధానంగా గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని కలెక్టర్ తెలిపారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, రాత్రిపూట చెమటలు, బరువు తగ్గడం, ఆకలి మందగించడం, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. కఫ పరీక్షలు, అవసరమైన ఇతర వైద్య పరీక్షల ద్వారా వ్యాధిని గుర్తించవచ్చని పేర్కొన్నారు.
క్షయ వ్యాధి నిర్ధారణ అయిన వారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందించే చికిత్సను వైద్యుల సూచనల మేరకు పూర్తిగా తీసుకోవాలని తెలిపారు. మందులను మధ్యలో ఆపివేయడం లేదా సక్రమంగా తీసుకోకపోవడం వల్ల ఔషధ నిరోధక క్షయ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అటువంటి రోగులు వైద్యుల సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ చికిత్స పూర్తి చేయాలని, వ్యాధి ఇతరులకు వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో క్షయ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో జోష్ టీములు, ఎన్సీసీ క్యాడెట్లు, యువత కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ కోరారు. గ్రామాల్లో క్షయ వ్యాధి నిర్ధారణ శిబిరాలు నిర్వహించి, అనుమానితులను గుర్తించి, అవసరమైన పరీక్షలు చేయించి, వ్యాధి నిర్ధారణ అయిన వారికి సకాలంలో చికిత్స అందేలా కృషి చేయాలని సూచించారు.
ప్రతి గ్రామాన్ని క్షయ వ్యాధి రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛంద సేవకులు, యువత, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖుల సహకారం తీసుకోవాలని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖతో పాటు ఇతర శాఖలు సమన్వయంతో పనిచేసి వరంగల్ జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా మార్చాలని పిలుపునిచ్చారు.
క్షయ వ్యాధి రహిత గ్రామాల సర్పంచులకు సన్మానం
టిబి ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా క్షయ వ్యాధి రహిత గ్రామాలుగా గుర్తింపు పొందిన గ్రామాల సర్పంచులను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజా రెడ్డి శాలువాలతో సత్కరించి, ప్రశంసాపత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా చాపలబండ గ్రామ సర్పంచ్ ఆలేటి పశు, దేశాయిపల్లి సర్పంచ్ ఉత్తరేణి భాగ్యలక్ష్మి, చెన్నారం సర్పంచ్ సింధం లలిత, కాశిగూడెం సర్పంచ్ పటాన్ రాజాక్, లోహిత గ్రామ సర్పంచ్ బొమ్మ నాగేష్ ప్రశంసాపత్రాలను అందుకున్నారు. నల్లబెల్లి గ్రామ సర్పంచ్ జక్క అనిత తరఫున ఎంపీడీవో వెంకట రమణ ప్రశంసాపత్రాన్ని స్వీకరించారు.
అనంతరం క్షయ వ్యాధి నిర్మూలనపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజా రెడ్డి, నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యా రాణి, కార్యక్రమ అధికారులు డాక్టర్ ఐ. ప్రకాష్, డాక్టర్ ఆర్. రాజమౌళి, డాక్టర్ సాజిదా అతహరి, డాక్టర్ అరుణ్ జోషి, ఉప జిల్లా మాస్ మీడియా అధికారి ఎస్. వెంకటేశ్వర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారులు, వైద్యాధికారులు, ఎఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఎన్సీసీ కమాండర్లు, క్యాడెట్లు, మై భారత్ స్వచ్ఛంద సేవకులు, విద్యార్థులు, క్షయ వ్యాధి విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.