ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్
ఇసుక లారీల అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై కఠిన చర్యలు
నిబంధనలు ఉల్లంఘిస్తే వాహన యజమానులదీ బాధ్యత
ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్
ములుగు జిల్లా: జిల్లాలో ఇసుక లారీల అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, రహదారులపై అక్రమ పార్కింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ తెలిపారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా వాహనాలు నడిపినా, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా లారీలను నిలిపినా చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇసుక లారీ డ్రైవర్లు నిర్దేశిత వేగ పరిమితులను తప్పనిసరిగా పాటించాలని, ప్రమాదకరంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడపకూడదని ఎస్పీ సూచించారు. ముఖ్యంగా జనావాస ప్రాంతాలు, ప్రధాన రహదారులు, విద్యాసంస్థలు, రద్దీగా ఉండే కూడళ్ల వద్ద అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. రహదారులపై, ప్రధాన కూడళ్ల వద్ద ఇతర వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించేలా లారీలను నిలపకుండా, నిర్ణీత పార్కింగ్ ప్రదేశాలను మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు.
డ్రైవర్లతో పాటు యజమానులదీ బాధ్యత
ఇసుక లారీల యజమానులు తమ డ్రైవర్లకు రహదారి భద్రతా నిబంధనలపై స్పష్టమైన సూచనలు ఇవ్వాలని ఎస్పీ కోరారు. డ్రైవర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే, సంబంధిత వాహన యజమానులను కూడా బాధ్యులను చేస్తామని తెలిపారు. ఉల్లంఘనల తీవ్రతను బట్టి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే వాహనాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.
మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు
డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపడం పూర్తిగా మానుకోవాలని ఎస్పీ సూచించారు. డ్రైవర్ల నిర్లక్ష్యం ఇతరుల ప్రాణాలకు ముప్పుగా మారకూడదని పేర్కొన్నారు. ములుగు జిల్లాలోకి వచ్చి వెళ్లే ఇసుక లారీలపై తనిఖీలు నిర్వహిస్తామని, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రోడ్డు భద్రతలో ప్రజల భాగస్వామ్యం అవసరం
రోడ్డు ప్రమాదాల నివారణ పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రజలు కూడా సమిష్టిగా భాగస్వాములు కావాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఎవరైనా మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు లేదా నిర్లక్ష్యంగా, ప్రమాదకరంగా వాహనాలు నడుపుతూ ప్రజలకు హాని కలిగించేలా వ్యవహరిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు లేదా అధికారులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారిపై ఆధారంగా నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నిబంధనల ఉల్లంఘనలను అరికట్టేందుకు జిల్లాలోని సంబంధిత ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని, మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, అక్రమ పార్కింగ్‌కు పాల్పడే వారిపై జరిమానాలతో పాటు అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
రహదారి భద్రతను పరిరక్షించడం, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం, ప్రమాదాలను నివారించడం ములుగు జిల్లా పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజల భద్రతకు భంగం కలిగించే ఉల్లంఘనలను సహించేది లేదని, ఇసుక లారీ యజమానులు, డ్రైవర్లు పోలీస్ శాఖకు సహకరిస్తూ రహదారి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడమే పోలీసుల అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు.