పండుగల వేళ జేబు దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలి ప్రజలకు మట్వాడ పోలీసుల సూచన
వరంగల్: పండుగల సందర్భంగా పూజా సామగ్రి, పూలు కొనుగోలు చేసేందుకు మార్కెట్లకు వచ్చే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మట్వాడ పోలీస్స్టేషన్ పోలీసులు సూచించారు. రద్దీగా ఉండే మార్కెట్లలో జేబు దొంగలు ప్రజల కదలికలను గమనిస్తూ, వారి వద్ద ఉన్న నగదు, మొబైల్ ఫోన్లు, పర్సులు, ఇతర విలువైన వస్తువులను దొంగిలించే అవకాశం ఉందని హెచ్చరించారు.
ప్రజలు తమ మొబైల్ ఫోన్లను చొక్కా జేబుల్లో పెట్టుకోవద్దని, నగదు, పర్సులు, ఇతర విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక అప్రమత్తతతో ఉండాలని, అపరిచితుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు.
ప్రజలు స్వీయ రక్షణపై అవగాహన కలిగి ఉండాలని, తమ వస్తువుల భద్రత విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని పోలీసులు కోరారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుని పండుగలను సురక్షితంగా జరుపుకోవాలని మట్వాడ పోలీస్స్టేషన్, వరంగల్ నగర పోలీసులు విజ్ఞప్తి చేశారు.