🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 09 Oct, 2026 | Page: 1

సోషల్ మీడియా మాయ లో పడొద్దు -షీ టీమ్ ఎస్. ఐ. ఎం.స్వాతి



- వరంగల్ గీసుకొండ లోని గంగాదేవిపల్లి ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం...

మహిళలపై జరిగే నేరాల అదుపులో అందరు భాగస్వామ్యం కావాలని తమవంతు బాధ్యతలను నిర్వర్తించాలని, జాగ్రత్తతో మెలగడం నేరాలను అదుపు చేయవచ్చని షీ టీమ్ ఎస్ ఐ స్వాతి అన్నారు.వరంగల్ గీసుకొండ లోని గంగాదేవిపల్లి ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో శుక్రవారం షీ టీమ్ గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మాయిలు ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, స్నాప్ చాట్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు, వివరాలు పంచుకోవడంలో జాగ్రత్త వహించాలని, మహిళలపై జరిగే సైబర్ నేరాల పై,అవగహన కలిగివుండాలని మరియు మహిళలు ఒంటరిగా తెలియని ప్రదేశాలకు ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు అందరు *టీ-సేఫ్* ఆప్ ను ఉపయోగించుకోవాలని, *టీ-సేఫ్* ఆప్ పై అవగాహన కలిగి ఉండాలని, ఉద్యోగాలు చేసే మహిళలకు తాము పనిచేసే ప్రదేశాలలో అసభ్యకరంగా ప్రవర్తించే వారి పట్ల, ఆకతాయుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, గుర్తు తెలియని వారితో తమ వ్యక్తిగత విషయాలు పంచుకోరాదని సూచించారు. ఎవరైనా మహిళలపై అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించినట్టైతే ధైర్యంగా వెంటనే షీ టీమ్ పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్ నేరాలు జరిగితే టోల్ ఫ్రీ నెంబర్ *1930* కి ఫిర్యాదు చేయాలని, మా షీ టీమ్ మొబైల్ నంబర్స్ సీపీ గారి వాట్సాప్ నంబర్ 8712685257, సీఐ వాట్సాప్ నెంబర్ 8712685142, ఎస్ఐ వాట్సాప్ నెంబర్ 8712685270కు ఫిర్యాదు చేసిన వారి వివరాలను చాలా గోప్యంగా ఉంచి నేరస్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామన్నారు.
షీ టీమ్ సబ్ -ఇన్స్పెక్టర్ ఎం.స్వాతి, గీసుకొండ ఎస్. ఐ బి. రవీందర్ మరియు సిబ్బంది కాలేజీ ప్రిన్సిపాల్, టీచర్స్ మరియు హెడ్ కాన్స్టేబుల్ సూర్య నారాయణ, ఉమెన్ కాన్స్టేబుల్ పూర్ణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
🏠 Home