చౌటుప్పల్ : సీసీ రోడ్డును కమ్మేసిన కంప చెట్లు - ప్రజల ఇక్కట్లు!
చౌటుప్పల్: సీసీ రోడ్డుదారిపైకి విస్తరించిన కంపచెట్లు.. ప్రజలకు ఇబ్బందులు!
పట్టణంలోని మున్సిపల్ వీధి , రోస్ బడ్స్
స్కూల్ వెనుక 17 వ వార్డు చంద్రపురి కాలనీ నుండి బంగారిగడ్డ కాలనీ రోడ్డు నెంబర్ 19 కి వెళ్లే దారిలో కంప చెట్లు పూర్తిగా సిసి రోడ్డును కమ్మేసి రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రాత్రి వేళల్లో సరైన వెలుతురు లేని కారణంగా పెరిగిన కంప చెట్లు రోడ్డును కమ్మేయడం వల్ల వాహనదారులు, పాదచారులకు ప్రమాదం పొంచి ఉంది.. అలాగే పెరిగిన ముళ్ల పొదల కారణంగా వీధి పరిసరాలు అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. మున్సిపల్ పరిధిలోని వీధులను ఎప్పటికప్పుడు పరిశీలించి, రహదారులకు అడ్డుగా పెరిగిన మొక్కలను తొలగించడంతో పాటు పారిశుద్ధ్య పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించి కంప చెట్లను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.