33 జిల్లాలను ఏర్పాటు చేసిన నాటి ఉద్యమ నేత నేటి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు యొక్క కృషిని ప్రజలు ఏనాడు మర్చిపోరని 40వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి
పరిపాలన సౌలభ్యం కొరకు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలను ఏర్పాటు చేసిన నాటి ఉద్యమ నేత నేటి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు యొక్క కృషిని ప్రజలు ఏనాడు మర్చిపోరని 40వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలను కేసీఆర్ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా అక్టోబర్ 10 వ తారీఖున చెట్లోళ్ల గడ్డ వద్ద బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపుమేరకు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి చిత్రపటానికి మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి క్షీరాభిషేకం చేసినారు గతంలో జిల్లాల పరిధి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ఉండి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు దృష్టికి తీసుకురావడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు గ్రహించి తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలను ఏర్పాటు చేసి ప్రతి జిల్లాకు కలెక్టర్ భవనం నిర్మింప చేసినారని అందువల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పినాయని అన్నారు నేడు ప్రజలందరూ రేవంత్ రెడ్డి సర్కార్ పీడ ఎప్పుడు వదిలి పోతుందోనని ఎదురుచూస్తున్నారని మళ్లీ కెసిఆర్ గారు ముఖ్యమంత్రిగా రాణించాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు నేటి యువత కేటీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీలో పనిచేయడానికి ఉత్సవం చూపుతున్నారన్నారు ఆర్టీసీ యూనియన్ ఎన్నికలలో అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు ఘోరంగా ఓటమి పాలైనారని బి ఆర్ఎస్ పార్టీ బలపరిచిన యూనియన్లు గెలుపొందినయని కాంగ్రెస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు ఇట్టి కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ నాయకులు వనం కుమార్, మరుపల్ల గౌతం పోలెపాక రాజన్ బాబు శెట్టి మోహన్ అంకం దేవానంద్ కళ్యాణపు వెంకటేశ్వర్లు భౌరిశెట్టి సదానందం కెంచ ఆనంద్ మాటేటి శ్యామ్ టమ్ టమ్ నరసింహ కుండె సదానందం చింతపట్ల ప్రశాంత్ నామాల రాజు అన్న శ్రీనివాస్ యాకూబ్ పాషా పోలేపాక మల్లేశం దాసరి నాగరాజు నరిగె సదానందం కొలుపుల కోటేశ్వర్లు ఉన్నారు