🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 11 Oct, 2026 | Page: 1

శివనగర్ వరంగల్‌లో ఘనంగా గ్యారవీ షరీఫ్ వేడుకలు..మహమ్మద్ షౌకత్ కమిటీ అధ్యక్షులు ఆధ్వర్యంలో గ్యారవీ షరీఫ్


*గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీక వరంగల్..అన్ని మతాలను గౌరవించుకోవడం మన సంప్రదాయం వక్తలు*

వరంగల్, అక్టోబర్ 11: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 35వ డివిజన్ శివనగర్ రైల్వే స్టేషన్ ఆటో పాయింట్ వద్ద గ్యారవీ షరీఫ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి వివిధ వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై మత సామరస్యాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ తోవక్కల్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ మహమ్మద్ అబ్దుల్ జబ్బార్,వ్యాపారవేత్త సయ్యద్ మఖ్దూమ్,సామాజిక కార్యకర్త మిర్గో అశోక్,మాజీ కార్పొరేటర్ నాగరాజు,బీఆర్ఎస్ నాయకుడు సయ్యద్ మసూద్,హసన్ అలీబేగ్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ వరంగల్ జిల్లా గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.హిందూ,ముస్లిం తదితర మతాలకు చెందిన ప్రజలు పరస్పరం కలిసిమెలిసి పండుగలను జరుపుకుంటూ,ఒకరి మత విశ్వాసాలను మరొకరు గౌరవించుకోవడం ఇక్కడి ప్రత్యేకత అని పేర్కొన్నారు.గ్యారవీ షరీఫ్ కార్యక్రమ నిర్వాహకులను అభినందిస్తూ,అన్నదాన కార్యక్రమం ద్వారా ఎంతోమంది పేదలకు భోజనం అందించడం అభినందనీయమని అన్నారు.ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యత,సోదరభావం,మత సామరస్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.గ్యారవీ షరీఫ్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ షౌకత్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంప్రదాయం ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ ఏడాది కూడా వివిధ వర్గాలకు చెందిన ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని అన్నారు.ఈ సందర్భంగా మసీదు ఖుతుబుల్ ఇస్లాం ఇమామ్ మౌలానా అస్లం రజా ఫాతెహా పఠనంతో పాటు ఇతర మతపరమైన కార్యక్రమాలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎండీ గమ్షా వలి,అఫ్జల్,సద్దాం హుస్సేన్,ఆటో యూనియన్ అధ్యక్షుడు కుమార్,యాకూబ్,మహమూద్,ఉమర్,రవీందర్,నాగేష్‌తో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
🏠 Home