మిల్స్ కాలనీలో ‘ఆపరేషన్ చెబుత్రా’ *28 మందిపై కేసులు..10 బైక్‌లు,24 మొబైల్ ఫోన్లు స్వాధీనం*
*తెలంగాణ/వరంగల్,అక్టోబర్ 12*
శాంతిభద్రతల పరిరక్షణ,బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం,అర్ధరాత్రి వేళల్లో అనవసరంగా సంచరించడం,న్యూసెన్స్‌కు పాల్పడే వారిని నియంత్రించే లక్ష్యంతో మిల్స్ కాలనీ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ‘ఆపరేషన్ చెబుత్రా’ నిర్వహించారు.వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత,ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ ప్రత్యేక తనిఖీల్లో 28 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు.వారి నుంచి 10 మోటార్‌సైకిళ్లు,24 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.చింతల్,అబ్బనికుంట,లేబర్ కాలనీ,ఫోర్ట్ వరంగల్,శివనగర్,ఎస్ఆర్ఆర్ తోట,ఉర్సుగుట్ట,కరీమాబాద్,ఉర్సు,శంభునిపేట,రంగశాయిపేట తదితర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 15 మందిపై సీపీ యాక్ట్ సెక్షన్ 70(ఏ) కింద కేసులు నమోదు చేయగా,ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ న్యూసెన్స్‌కు పాల్పడిన మరో 13 మందిపై సీపీ యాక్ట్ సెక్షన్లు 21,70,76 కింద కేసులు నమోదు చేశారు.అదుపులోకి తీసుకున్న 28 మందికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు.అర్ధరాత్రి వేళల్లో అనవసరంగా బయట తిరగడం,బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం,న్యూసెన్స్‌కు పాల్పడటం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు.‘ఆపరేషన్ చెబుత్రా’నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని,ప్రతిరోజూ తనిఖీలు నిర్వహిస్తామని మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ కర్రె స్వామి తెలిపారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ ఆపరేషన్‌లో ఇన్స్పెక్టర్ కర్రె స్వామితో పాటు సీఐలు మంగిలాల్,ఎస్.శ్రీనివాస్,ఐ.శ్రీనివాస్,శ్యాంసుందర్,పలువురు ఎస్ఐలు,టాస్క్‌ఫోర్స్,త్వరిత స్పందన బృందం,ఇతర పోలీసు సిబ్బంది కలిపి సుమారు 40 మంది పాల్గొన్నారు.