మామ్నూరు పీటీసీలో యువ ఆపదా మిత్ర శిక్షణ.. రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
వరంగల్, అక్టోబర్ 12: వరంగల్ జిల్లా మామ్నూరులోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీ (పీటీసీ)లో నిర్వహిస్తున్న CATC-VIII శిక్షణ శిబిరంలో భాగంగా యువ ఆపదా మిత్ర పథకంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమంతో పాటు స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
అక్టోబర్ 5 నుంచి 14 వరకు కొనసాగుతున్న ఈ శిక్షణ శిబిరంలో భాగంగా క్యాడెట్లకు అగ్నిప్రమాదాల నివారణ, అగ్నిమాపక పరికరాల వినియోగం, ప్రమాద సమయాల్లో సురక్షితంగా వ్యవహరించే విధానాలపై నిపుణులైన ఇన్స్ట్రక్టర్లు అవగాహన కల్పించారు. అగ్నిమాపక యంత్రాలను ఉపయోగించి మంటలను అదుపు చేసే విధానాలను ప్రత్యక్షంగా ప్రదర్శించారు.
అనంతరం భారతీయ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదానం ప్రాముఖ్యత, రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం గురించి క్యాడెట్లు, సిబ్బందికి అవగాహన కల్పించారు. అర్హులైన క్యాడెట్లు, ANOలు, సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి సామాజిక బాధ్యతను చాటుకున్నారు.
క్యాంప్ కమాండెంట్ కల్నల్ ఎస్.ఎస్. రామధురై, డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ రవి సున్హరే, సుబేదార్ మేజర్ రాకేష్ సింగ్ తోమర్ నాయకత్వంలో శిబిరం కొనసాగుతోంది. శిక్షణా బృందం, క్యాంప్ అడ్జుటెంట్, ఇతర అధికారులు, CTOలు కార్యక్రమాల నిర్వహణలో సహకరించారు.
ఈ సందర్భంగా క్యాంప్ కమాండెంట్ క్యాడెట్ల సేవాభావాన్ని అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు యువతలో క్రమశిక్షణ, నిస్వార్థ సేవ, సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. విపత్తుల సమయంలో ప్రజలకు సహాయం చేయడానికి యువత సిద్ధంగా ఉండాలని సూచించారు.
ఈ శిబిరం ఈ నెల 14 వరకు కొనసాగనుండగా, విపత్తుల నిర్వహణ, ప్రథమ చికిత్స, వ్యక్తిత్వ వికాసం తదితర అంశాలపై