కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పెట్టిన విధంగా అమలు పరచకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులు లేకుండా చేస్తామని వరంగల్ ఉమ్మడి జిల్లా ల ఉద్యమకారుల సంఘం కన్వీనర్ మరుపల్ల రవి
తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించిన ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పెట్టిన విధంగా అమలు పరచకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులు లేకుండా చేస్తామని వరంగల్ ఉమ్మడి జిల్లా ల ఉద్యమకారుల సంఘం కన్వీనర్ మరుపల్ల రవి హెచ్చరించినారు మంగళవారం రోజున వరంగల్ చౌరస్తా లో ఉద్యమకారులందరూ చెవిలో పువ్వు పెట్టుకొని నిరసన కార్యక్రమం చేపట్టి మరుపల్ల రవి మాట్లాడినారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎంతో మంది ఉద్యమకారులు తమ సంపాదన కోల్పోయి తమ కుటుంబాలను మరిచిపోయి తెలంగాణ రాష్ట్ర సాధనే ద్యేయంగా పనిచేసిన ఉద్యమకారుల బతుకులు నేడు ఎంతో ఘోరంగా ఉందని తెలంగాణ ఉద్యమంలో జైలు జీవనం రిమాండ్ బైండోవర్లు అయినవారికి కాంగ్రెస్ ప్రభుత్వం 250 గజాల ఇంటి స్థలం ప్రతినెల 25 వేల రూపాయల పెన్షన్ ఇస్తామని ఆరు గ్యారెంటీలలో పేర్కొని మూడు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఇప్పటికైనా ఉద్యమకారు లకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే తెలంగాణ ఉద్యమంలాగే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పై ఉద్యమకారులు ఉద్యమిస్తారని ఆయన హెచ్చరించినారు రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ కేశవరెడ్డి కమిటీ డౌన్ డౌన్ ఉద్యమకారు లకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని పెద్ద ఎత్తున నినాదాలు చేసినారు ఇట్టి నిరసన కార్యక్రమంలో ఉద్యమకారులు మేకల ఎల్లయ్య శంకేసి లింగమూర్తి నాగవెల్లి సాంబయ్య మట్టెడ కరుణాకర్ కెంచ ఆనంద్ భూంపల్లి జయశంకర్ ఆవునూరు లక్ష్మి ఆడెపు రాధిక ఐత ప్రభాకర్ పరికిపండ్ల ఈశ్వరయ్య మాడిశెట్టి రాజ్ కుమార్ వనం కుమార్ తాళ్లపల్లి శ్రీనివాస్ ఇమ్మడి వీరస్వామి పంగి విశ్వేశ్వరరావు బస్కే రంజిత్ బోగోజు లక్ష్మణమూర్తి మడిపోజు సంజీవ చారి తదితరులు ఉన్నారు