🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 14 Oct, 2026 | Page: 1

సెలవులు అంటే సరదా మాత్రమే కాదని .. సృజనాత్మకతకు నిలయమని చాటి చెపుతున్న విద్యార్థిని!

దసరా సెలవులలో సృజనాత్మకతకు పదును పెడుతూ.. గురుకులంలో చదువుతున్న ఓ విద్యార్థిని సెలవులను వినూత్నంగా ఉపయోగించుకుంటోంది. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన 8వ తరగతి విద్యార్థిని సహస్ర కాగితాలు ఉపయోగించి ఆకర్షణీయమైన అలంకరణ వస్తువులను తయారు చేస్తూ తన ప్రతిభను చాటుకుంటోంది. సాధారణంగా పారవేసే వస్తువుల్లోనూ కొత్తదనాన్ని గుర్తించి, వాటికి మరో రూపాన్ని ఇవ్వడం ఈ విద్యార్థిని ప్రత్యేకత. తన ఆలోచనలకు సృజనాత్మకతను జోడించి రూపొందిస్తున్న కళాకృతులు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
సెలవులు అంటే సరదా మాత్రమే కాదు.. నేర్చుకునే సమయం కూడా!
విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయడానికి సెలవులు మంచి అవకాశమని ఈ ప్రయత్నం చాటిచెబుతోంది. పుస్తకాల చదువుతో పాటు కళలు, చేతిపనులు, కొత్త విషయాలపై ఆసక్తి పెంచుకోవడం ద్వారా పిల్లలు తమలోని ప్రతిభను అభివృద్ధి చేసుకోవచ్చు. కాగితాలతో రూపొందించిన రంగురంగుల పూలు, గులాబీలు, పూల అలంకరణలు, చెట్ల చిత్రాలు ఆమె కళాత్మక నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్న వస్తువులను ఉపయోగించి ఆకర్షణీయమైన కళాకృతులను రూపొందించడం విశేషం.
విద్యార్థుల్లో చదువుతో పాటు కళలు, చేతిపనులపై ఆసక్తిని పెంపొందించడం ద్వారా వారిలో సృజనాత్మకత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఈ విద్యార్థిని దసరా సెలవులను వినూత్నంగా వినియోగించుకుంటూ తోటి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
🏠 Home