కాశిబుగ్గలో ఘనంగా దుర్గాభవాని మహా అన్నదానం
వరంగల్, అక్టోబర్ 17: వరంగల్ నగరంలోని కాశిబుగ్గలో దుర్గాభవాని యూత్ ఆధ్వర్యంలో శనివారం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గోపాల్ నవీన్ రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు శ్రీ దుర్గాభవాని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు.
అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, రాష్ట్రం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కొమ్ముల కిషోర్, గన్పాక సుధాకర్, జన్ను శ్యామ్, మబ్బు ప్రవీణ్, కె. సంపత్, గడ్డమీద రాజేష్, శ్రీకాంత్, అరుణ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, దుర్గాభవాని యూత్ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.