దళిత బంధు రెండో విడత నిధులు విడుదల చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా గత మూడు సంవత్సరాలు దళిత బంధు సాధన సమితి పేరుతోటి గత ప్రభుత్వంలో మంజూరైన దళిత బంధు నిధులను విడుదల చేసి గ్రౌండింగ్ చేయాలని దళిత బంధు సాధన సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షులు కందుల లక్ష్మయ్య, నల్లగొండ నియోజకవర్గ ఇంచార్జ్ బడుపుల శంకర్ డిమాండ్ చేశారు. నిధులు విడుదల చేయాలనీ గత మూడు సంవత్సరాలనుండి జరిగిన పోరాటాలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఒక హుజురాబాద్ లో మాత్రం రెండో విడత లబ్ధిదారులకు నిధులు విడుదల చేయాలని జీవో జారీ చేయడం శుభ పరిణామం. అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17,500 మంది లబ్ధిదారులు నిధులు విడుదల చేయాలని నిరంతరం పోరాటం చేస్తున్నారు హుజురాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా దళిత జాతి బిడ్డ అయిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వారి యొక్క నియోజకవర్గం లోని అన్ని మండలాలలో దళిత బంధు నిధులు రెండవ విడత గ్రౌండింగ్ చేయించి.ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి దళితుల పట్ల వారు మాట్లాడకపోవడం మౌనం వహించడం దళిత జాతికి ద్రోహం చేసే విధంగా ఉన్నదని అన్నారు ఇప్పటికైనా హుజురాబాద్ కు ఏ రకంగా అయితే నిధులు విడుదల చేశారో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జీవో విడుదల చేసి నిధుల విడుదలకు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు, దళిత ఎమ్మెల్యేలు ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని నిధులు సాధించి దళిత కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో ఆదిమల్ల లింగయ్య, మర్రి రేణుక, ఇరిగి ప్రసాద్, కందుల రమేష్, కందుల నరేందర్, పెరపాక నర్సింహా, మంద శివ,అశోక,మైనం నాగయ్య