🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 23 Oct, 2026 | Page: 1

సేవా కార్యక్రమాలతో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు జన్మదిన వేడుకలు



వరంగల్ చౌరస్తాలో కేక్ కటింగ్, అన్నదానం.. మున్సిపల్ కార్మికులకు దుప్పట్ల పంపిణీ

వరంగల్, అక్టోబర్ 23: మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని వరంగల్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోపాల్ నవీన్ రాజు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కొండా మురళీధర్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాష్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం కాంగ్రెస్ పార్టీ 25వ డివిజన్ సీనియర్ నాయకుడు జన్ను శ్యామ్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు గోపాల్ నవీన్ రాజును శాలువాతో సత్కరించారు. జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడంలో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నగర పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తూ ప్రజలకు సేవలందిస్తున్న మున్సిపల్ కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు.

ఈ వేడుకలు నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ఆత్మీయ వాతావరణంలో జరిగాయి. పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కొండా మురళీధర్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
🏠 Home