నవంబర్ 6 వ తారీఖున దీపావళి పండుగ
నవంబర్ 6 వ తారీఖున దీపావళి పండుగ సందర్భంగా జరుగు నరకాసుర వద ఉత్సవాలలో పాల్గొనే వాహనదారులకు ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ ను నియంత్రించడానికి తగు ఏర్పాటు చేస్తామని వరంగల్ నగర అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ రాయల ప్రభాకర్ రావు అన్నారు శనివారం రోజున నరకాసుర వధ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మరుపల్ల రవి ఆధ్వర్యంలో వారికి పూల మొక్కను అందజేసి శాలువా కప్పి వినతి పత్రం ఆహ్వాన పత్రికలను అందజేశారు నరకాసురవద ఉత్సవములు ఉర్సు గుట్ట కూడా మైదానం లో సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9:30 వరకు ఉత్సవాలు జరుగుతాయని ఇట్టి ఉత్సవాలను తిలకించడానికి ప్రజా ప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు జిల్లా ఉన్నతాధికారులు వేలాదిమంది ప్రజలు వాహనాలలో విచ్చేస్తారని నరకాసుర వద ఉత్సవ కమిటీ అధ్యక్షులు మరుపల్ల రవి అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్ కు వివరించినారు అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్ మాట్లాడుతూ నరకాసుర వధ ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతున్నందున వాహనదారులు ప్రజలు ఇబ్బందులు పడకుండా ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేస్తామన్నారు వినతిపత్రం ఆహ్వాన పత్రిక అందజేసిన వారిలో నరకాసుర వద ఉత్సవ కమిటీ ప్రతినిధులు మరుపల్ల గౌతం దూడే బాలకోమురెల్లి వనం కుమార్ కుండె రాజు ఆవునూరు ఐలేశం దాసరి రాజు కుండే సదానందం లు ఉన్నారు