ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు ..కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు-మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఎండిపోయిన ఎస్సారెస్పీ కాలువలు… ఎండుతున్న రైతుల ఆశలు… ఇదేనా కాంగ్రెస్ పాలన
జన చరిత్ర న్యూస్ (బ్యూరో పర్వతగిరి)
వరంగల్లోని ఆరేపల్లి వద్ద ఎస్సారెస్పీ ప్రధాన కాలువలను పరిశీలించిన
మాజీ మంత్రి వర్యులు
ఎర్రబెల్లి దయాకర్ రావు
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రజల పండుగైన బతుకమ్మకైనా నీళ్లు అందించలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రైతులకు సాగునీరు అందించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడింది
రైతులకు నీళ్లివ్వడం చేతకాక చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం! కాలువల్లో నీళ్లు పారాల్సిన సమయంలో ఎడారిని తలపిస్తున్న పరిస్థితులు కాంగ్రెస్ పాలనలోని అసమర్థతకు నిదర్శనమని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు… ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రణాళికా వైఫల్యంతో రైతులపై రుద్దుతున్న కరువని ధ్వజమెత్తారు.
పండుగలకు నీళ్లు లేవ పంటలకు భరోసా లేదు రైతులకు సమాధానం చెప్పే పాలకులే లేరు! తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న ఈ దుస్థితికి బాధ్యత వహించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటికైనా కళ్లు తెరిచి ఎస్సారెస్పీ కాలువలకు నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, మర్రి రాజశేఖర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు*