నిరుపేద పద్మశాలి విద్యార్థినికి ఐదేళ్ల పాటు ట్యూషన్ ఫీజు చెల్లించనున్న TPUS
ఎంబీబీఎస్ విద్యకు భరోసా.. పేద విద్యార్థిని చదువుకు అండగా తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం
వరంగల్: నిరుపేద కుటుంబానికి చెందిన ప్రతిభావంతురాలైన పద్మశాలి విద్యార్థిని కొంతం వైష్ణవి ఎంబీబీఎస్ విద్యకు తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం (TPUS) వరంగల్ జిల్లా తరఫున చేయూత అందించేందుకు ముందుకు వచ్చింది. విద్యార్థిని వైద్య విద్యను అభ్యసించేందుకు అవసరమైన ట్యూషన్ ఫీజును ఐదేళ్ల పాటు చెల్లిస్తామని సంఘం హామీ ఇచ్చింది. పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా నిలిచే లక్ష్యంతో సంఘం తీసుకున్న ఈ నిర్ణయం పలువురి ప్రశంసలు అందుకుంది.
వరంగల్లో సోమవారం నిర్వహించిన POPA పద్మశాలి ప్రతిభా పురస్కార ఆత్మీయ సన్మానోత్సవ కార్యక్రమంలో సంగెం మండలం గవిచర్ల గ్రామానికి చెందిన కొంతం వైష్ణవి తనకు మహబూబాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు లభించిందని, అయితే తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువు కొనసాగించేందుకు ఆర్థిక సహాయం అవసరమని తెలిపింది. విద్యార్థిని పరిస్థితిని అర్థం చేసుకున్న తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు స్పందించి, సంఘం తరఫున ఆమెకు సహాయం అందిస్తామని ప్రకటించారు.
ఈ మేరకు ప్రతి సంవత్సరం రూ.29,000 చొప్పున ఐదేళ్ల పాటు మొత్తం రూ.1,45,000 ట్యూషన్ ఫీజును చెల్లించనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా సోమవారం మహబూబాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఫీజు చెల్లించేందుకు సంఘం తరఫున చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రతిభావంతులైన పేద విద్యార్థులు తమ లక్ష్యాలకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ సహాయాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
వైద్య విద్యను అభ్యసించి భవిష్యత్తులో వైద్యురాలిగా ఎదగాలనే లక్ష్యంతో ఉన్న వైష్�