🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 26 Oct, 2026 | Page: 1

వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

ఆరు రోజులుగా కొనసాగుతున్న సేవా కార్యక్రమం

వరంగల్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా చైర్మన్ బేతి అశోక్ బాబు ఆధ్వర్యంలో వరంగల్‌లోని సీకేఎం ఆసుపత్రి నందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత ఆరు రోజులుగా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఆసుపత్రికి వచ్చే రోగుల సహాయకులకు, అవసరమైన వారికి భోజనం అందిస్తున్నారు.

మానవతా దృక్పథంతో, సేవాభావంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే లక్ష్యంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ముందుకు సాగుతోంది.

ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు కుసుమ సత్యనారాయణ, మండల పరశురాములు, మామిడాల రమేష్ బాబుతో పాటు రెడ్ క్రాస్ సభ్యులు చిప్ప వెంకటేశ్వర్లు, రాజు తదితరులు పాల్గొన్నారు.

మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తితో ప్రజలకు సేవలందించడమే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు.
🏠 Home