న శాంతి భద్రతల పరిరక్షణ కొరకు ఉర్సు గుట్ట కూడా మైదానం సభాస్థలిలో పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు
దీపావళి పండుగ సందర్భంగా జరుగు నరకాసుర వద ఉత్సవములు నవంబర్ 6 వ తారీఖున జరుగుతున్నందున శాంతి భద్రతల పరిరక్షణ కొరకు ఉర్సు గుట్ట కూడా మైదానం సభాస్థలిలో పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయిస్తానని వరంగల్ సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత అన్నారు సోమవారం రోజున హనుమకొండలోని పోలీస్ కమిషనరేట్ లో నరకాసుర వద ఉత్సవ కమిటీ అధ్యక్షులు మరుపల్ల రవి ఆధ్వర్యంలో సెంట్రల్ జోన్ డిసిపి దార కవితకు పూల మొక్కను అందజేసి వినతి పత్రము ఆహ్వాన పత్రికను అందజేసినారు నవంబర్ ఆరో తారీఖున సాయంత్రం 6 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమంలు ప్రారంభం అవుతాయని రాత్రి 8 గంటల 45 నిమిషములకు నరకాసురుని బొమ్మకు బాంబులు అమర్చి పేల్చివేస్తామని ఇట్టి కార్యక్రమానికి మాజీ మంత్రి వరంగల్ తూర్పు నియోజకవర్గం శాసన సభ్యురాలు కొండ సురేఖ మురళీధర్ రావు లతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు వేలాదిమంది ప్రజలు పాల్గొంటారని డిసిపి దార కవిత కు అధ్యక్షులు మరుపల్ల రవి వివరించినారు వినతిపత్రం ఇచ్చిన వారిలో నరకాసుర వధ ప్రతినిధులు మరుపల్ల గౌతం దూడే బాల కొమురెల్లి వనం కుమార్ కాటం సతీష్ కుండే రాజు గౌడ కోటేశ్వర్ బలభద్ర శివకృష్ణ లు ఉన్నారు