🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 27 Oct, 2026 | Page: 1

అర్హులందరూ ఓటర్లుగా నమోదు కావాలి


నల్లగొండ: అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని జిల్లా ఓటరు జాబితా పరిశీలకురాలు దేవసేన సూచించారు. మంగళవారం చండూరులో మునుగోడు నియోజకవర్గ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓటరు జాబితాలో అర్హుల పేర్లు తప్పిపోకుండా రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఓటరు జాబితాపై వచ్చిన అభ్యంతరాలను నవంబర్‌ 5లోగా పరిష్కరించి, నవంబర్‌ 9న తుది జాబితా ప్రచురించనున్నట్లు కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌ తెలిపారు. అనంతరం జిల్లాలోని ఎన్నికల అధికారులతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై దేవసేన సమీక్ష నిర్వహించారు.
🏠 Home