🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 27 Oct, 2026 | Page: 1

మోదీపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు: పిల్లి రామరాజు యాదవ్

ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్లగొండ గడియారం సెంటర్‌లో దిష్టిబొమ్మ దహనం

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ నాయకులు నల్లగొండలో ఆందోళన చేపట్టారు. పట్టణంలోని గడియారం సెంటర్‌లో ఖర్గే దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు అభివృద్ధి, ప్రజా సమస్యలు, విధానాల ఆధారంగా ఉండాలే తప్ప వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వకూడదని పేర్కొన్నారు. ప్రధాని పదవికి గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

ప్రజా సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని, కాంగ్రెస్ నాయకులు విమర్శలకు బదులుగా తమ అభివృద్ధి ప్రణాళికలను ప్రజలకు వివరించాలని పిల్లి రామరాజు యాదవ్ సూచించారు.

ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులతో పాటు కార్పొరేటర్, మహిళా మోర్చా, యువ మోర్చా నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 Home