ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్న చల్లా హిమశ్రీ (14) అనారోగ్యంతో మృతి చెందింది. ఆర్‌ఎంపీ వద్ద వైద్యం చేయించుకున్న అనంతరం బాలిక పరిస్థితి విషమించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఆదివారం హిమశ్రీ జలుబు, జ్వరంతో అస్వస్థతకు గురైంది. దీంతో తల్లిదండ్రులు ఆమెను స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ బాలికకు ఇంజెక్షన్ ఇచ్చిన అనంతరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడినట్లు తెలిపారు.
పరిస్థితి విషమించడంతో వెంటనే హిమశ్రీని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి బాలిక అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
అయితే వైద్యం చేస్తున్న సమయంలో ఆర్‌ఎంపీ మద్యం సేవించి ఉన్నాడని హిమశ్రీ కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమ కుమార్తె మృతికి ఆర్‌ఎంపీనే కారణమంటూ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. బాలిక మృతికి అసలు కారణం ఏమిటనే విషయంపై వైద్య పరీక్షలు, పోలీసుల దర్యాప్తు అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.