నిషేధిత ఆస్తుల జాబితాపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు
అర్హులందరికీ న్యాయం చేస్తాం.. నిషేధిత భూములు, ఆస్తులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు
ష్ట్రంలో నిషేధిత భూములు, ఆస్తుల విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 22ఏ, పీఓబీ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు. భూముల రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన అన్ని జీవోలు, ఉత్తర్వులు, భూసేకరణ పత్రాలు, లేఅవుట్ అనుమతులను ఈనెల 14లోగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. పీఓబీ దరఖాస్తులను ఇకపై నేరుగా కలెక్టర్లకు పంపాలని.. రిజిస్ట్రేషన్లను గుడ్డిగా తిరస్కరించకుండా కారణాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు.
నిషేధిత ఆస్తుల జాబితాపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు
తెలంగాణలో 22ఏ లేదా నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్న భూములు, ఆస్తుల విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. చట్టబద్ధంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న సాంకేతిక, చట్టపరమైన సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కొత్తగా తమ ప్రభుత్వం ఎలాంటి భూములను నిషేధిత జాబితాలో చేర్చలేదని వెల్లడించారు. 22ఏ, పీఓబీ అంశంపై మంగళవారం సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు.. జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లతో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను జిల్లాల వారీగా పరిశీలించారు. అర్హులైన బాధితులకు వీలైనంత త్వరగా ఊరట కల్పించాలని అధికారులను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. భూముల రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన జీవోలు, ఉత్తర్వులు, మెమోలు, భూసేకరణ ప్రొసీడింగ్స్, లేఅవుట్ అనుమతులు సహా అన్ని రికార్డులను ఈనెల 14వ తేదీలోగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.