ఇల్లంద హనుమాన్ టెంపుల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం
వర్ధన్నపేట, ఆగస్టు 12: వరంగల్–ఖమ్మం ప్రధాన రహదారిపై ఇల్లంద గ్రామ సమీపంలోని హనుమాన్ టెంపుల్ వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఓ వ్యక్తిని ఢీకొట్టడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని వాహనం ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.గాయపడిన వ్యక్తి ఎవరు? ప్రమాదానికి కారణమైన వాహనం ఏది? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.