🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 13 Aug, 2026 | Page: 1

ప్రియుడి మోజులో పడి భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన భార్య

అన్నంలో నిద్ర మాత్రలు కలిపి.. ఇనుపరాడ్డు, గుండ్రాయితో తల పగలగొట్టిప్రియుడి మోజులో పడి భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన భార్య

చిత్తూరు జిల్లా పీలేరు డిష్ కాలనీకి చెందిన మంగినేని వెంకట సుబ్రహ్మణ్యం, ఉమాదేవి(42) భార్యాభర్తలు.. వీరికి ఒక కుమారుడు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన చారాల సుబ్రహ్మణ్యం (32) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఉమాదేవి

దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు రాగా.. ఎలాగైనా సుబ్రహ్మణ్యం అడ్డు తొలగించాలని పథకం వేసిన ఉమాదేవి

ఈ నెల 8న భర్త సుబ్రహ్మణ్యం తినే అన్నంలో నిద్రమాత్రలు కలిపి, నిద్రలోకి జారుకున్న తర్వాత ప్రియుడితో కలిసి ఇనుపరాడ్డు, గుండ్రాయితో తల పగలగొట్టి దారుణంగా హత్య చేసిన ఉమాదేవి

ఆ తర్వాత రాత్రి 2.30 గంటలకు మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి మదనపల్లె-తిరుపతి జాతీయ రహదారిపై పడేసి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం

కొడుకు మృతిపై అనుమానంగా ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసిన సుబ్రహ్మణ్యం తండ్రి

దీంతో పోలీసులు విచారించగా ప్రియుడితో కలిసి భర్తను తానే హత్య చేశానని ఒప్పుకున్న ఉమాదేవి

ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింపు
🏠 Home