🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 13 Aug, 2026 | Page: 1

ఎంపీపీ ఎస్ పాఠశాలకు ప్రింటర్ బహుకరణ

జన చరిత్ర న్యూస్ పర్వతగిరి : పర్వతగిరి మండలం కేంద్రంలోని స్థానిక ఎంపీపీ ఎస్ పాఠశాల కు ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల సౌజన్యంతో పాఠశాలకు ప్రింటర్ను సమకూర్చుకోవడం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో ప్రింటర్ ఉండడం వలన విద్యార్థులకు గుణాత్మక విద్య అందించడం సులభం అవుతుందని చెప్పడం జరిగింది. విద్యార్థులకు సుభాషిని తిథి భోజనం సందర్భంగా అరటి పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ కె. నవీన్ కుమార్, స్టాఫ్ సెక్రటరీ రామస్వామి, ఏ ఏ పీ సిచైర్ పర్సన్ నీరటి జ్యోతి , కాంప్లెక్స్ ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు పాక రమేష్ బాబుమరియు ఉపాధ్యాయులు లలితా దేవి, నవీన్ కుమార్, ప్రసాద్ మరియు కిషన్ పాల్గొన్నారు.
🏠 Home