🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 13 Aug, 2026 | Page: 1

M1 టీవీ కథనానికి స్పందించిన ఎన్‌ఎస్ఎస్ ఫౌండేషన్

10 వేల ఆర్థిక సహాయం అందజేత
వరంగల్: శ్రీపాద మనోహర్ కూతురి వివాహానికి సంబంధించి M1 టీవీ ద్వారా ఇచ్చిన ప్రకటనకు పలువురు స్పందిస్తూ తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్‌ఎస్ఎస్ ఫౌండేషన్ ముందుకు వచ్చి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందించింది.
కార్యక్రమంలొ ఎన్‌ఎస్ఎస్ ఫౌండేషన్ ప్రతినిధులు రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కష్టాల్లో ఉన్న కుటుంబానికి వివాహ సమయంలో అండగా నిలవడం సామాజిక బాధ్యతగా భావించి ఈ సహాయం అందించినట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీపాద మనోహర్ కుటుంబం ఆర్థిక సహాయం అందిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే ప్రతి ఒక్కరి సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్ఎస్ ఫౌండేషన్ ప్రతినిధులు నాగవెల్లి సరిత నరేందర్, శ్రీరామ్ కళ్యాణ్, బేతి రాజు, కోలా కార్తీక్, చింతా రంజిత్‌,అమరేంద్ర చారి పాల్గొన్నారు. వివాహానికి సహాయం అందించిన ఎన్‌ఎస్ఎస్ ఫౌండేషన్ సభ్యులకు ఎం1 టీవీ యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
🏠 Home